తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామల్లో సదా ఒకరు. నితిన్ హీరోగా పరిచయమవుతూ చేసిన 'జయం' సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం వల్ల ఈమెకు.. ఎన్టీఆర్ తో 'నాగ' చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు తర్వాత 'దొంగ దొంగది' 'మోనాలిసా' 'లీలా మహల్ సెంటర్' 'ఔనన్నా కాదన్నా' 'చుక్కల్లో చంద్రుడు' 'వీర భద్ర' 'క్లాస్ మేట్స్' 'టక్కరి' వంటి సినిమాల్లో నటించినా ఈమె అనుకున్న స్థాయికి చేరుకోలేదు. ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా అవి ఫ్లాప్ అయ్యాయి. (Sada) ఈమె స్టోరీ సెలక్షన్ మిస్ ఫైర్ అవ్వడం కూడా దీనికి ఓ కారణమని చెప్పొచ్చు. సదా ప్రస్తుతం బుల్లితెర పై షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.ఇటీవల వచ్చిన 'అహింస' తో రీ ఎంట్రీ ఇచ్చినా అది ప్లాప్ అవ్వడంతో సినిమాలకు మళ్ళీ దూరమైనట్టు అయ్యింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి : ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) ; View this post on Instagram ; A post shared by Sadaa (@sadaa17) https://youtu.be/OGmGgVasS8Y మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్! ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్! మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!