“వెళ్లవయ్యా వెళ్లూ..” అంటూ “జయం” సినిమాలో బుంగమూతి పెట్టుకొని ముద్దుగా కనిపించిన సదాను తెలుగమ్మాయి అంటే ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు. లంగాఓణిలో అంత ఒద్దికగా కనిపించింది అమ్మడు. అయితే.. కొన్నాళ్లు “జయం” పేరు చెప్పుకొని కెరీర్ ను నెట్టుకొచ్చిన సదా. అయితే.. తదనంతరం క్రేజ్ తగ్గడంతోపాటు అవకాశాలు కూడా సరిగా రాకపోయేసరికి సదా సినిమాలకు స్వస్తిపలికి టెలివిజన్ కు దగ్గరైంది. తెలుగులో “ఢీ జోడీ” షోకు రెండు సీజన్లు జడ్జ్ గా వ్యవహరించిన సదాను తాజాగా ప్రియమణి రీప్లేస్ చేసింది. దాంతో మళ్ళీ సినిమాలవైపు దృష్టి సారించింది సదా.
అయితే.. తన రీఎంట్రీ కాస్త సెన్సేషన్ అవ్వాలని ప్లాన్ చేసుకొన్న సదా రెగ్యులర్ హీరోయిన్ గా మళ్ళీ ప్రేక్షకుల్ని పలకరిస్తే వాళ్ళు పట్టించుకొనే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి.. మాంచి హాట్ హాట్ రోల్ లో కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతోంది. “టార్చ్ లైట్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ స్పైసీ ఎంటర్ టైనర్ లో సదా వేశ్యగా నటించనుంది. వేశ్యల జీవితాల గురించి తెరకెక్కనున్న ఈ చిత్రంలో బోలెడన్ని శృంగార సన్నివేశాలుంటాయని.. సదా ఆ సీన్స్ అన్నిటిలోనూ ఎలాంటి మొహమాటం లేకుండా జీవించనుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. మరి సెన్సేషనల్ రీఎంట్రీ సదాకు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.