Samantha: చర్మ సమస్యలతో బాధపడుతున్న సమంత!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా సినీ కెరియర్ పై దృష్టి పెట్టారు. ఇలా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ముఖ్యంగా నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకునేవారు. అయితే సమంత గత నెల రోజుల నుంచి పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అప్డేట్ చేయకపోవడంతో అభిమానులు సమంతకు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. ఇకపోతే సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చేత ఈమె గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి

ఈమె ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని తద్వారా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసమే ఈమె ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సమంత అమెరికాకు వెళ్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సమంత గత కొంతకాలం నుంచి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, అందుకే బయట కూడా సమంత కనపడటం లేదని పలువురు భావిస్తున్నారు. ఇలా చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తలకు పుల్ స్టాప్ పడాలంటే సమంత స్పందించాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus