Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీ..!

సమంత .. ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె సినిమా వచ్చినా, నాగ చైతన్య సినిమా వచ్చినా.. వీళ్ళు ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వాటికి వీళ్ళు ఏది స్ట్రైట్ గా చెప్పకుండా దాటేస్తున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక సమంత విషయానికి వస్తే ‘యశోద’ సినిమా రిలీజ్ టైంలో మయోసైటిస్ వ్యాధికి గురై.. కొన్నాళ్ళు అవస్థలు పడింది. అయితే దాని వల్ల ఏర్పడ్డ సింపతీ వల్ల ‘యశోద’ సినిమా బాగానే ఆడింది.

కానీ ‘శాకుంతలం’ చిత్రం మాత్రం ఘోరంగా ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హిందీలో ‘సిటడెల్’ వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈమె పెట్టే పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ జ్యువెల్ గమాడియాకు సూటబుల్ మ్యాచ్ కావాలని ఈమె పేర్కొంది.‘డాక్టర్ జ్యువెల్ గమాడియాకు సరైన మ్యాచ్ కోసం వెతుకుతున్నాను.

అతను బయటకు కనిపించే దాని కంటే చాలా తెలివైనవాడు. (Samantha) నేను హామీ ఇస్తున్నాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. డాక్టర్ జ్యువెల్ … అనుష్క శర్మ నుండి కత్రినా కైఫ్ వరకు, అజయ్ దేవగన్ నుంచి బీటౌన్ ప్రముఖులు అందరికీ ‘గో-టు డాక్టర్’ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన వద్ద సమంత కూడా చికిత్స పొందినట్టు తెలుస్తుంది. అందుకే అతనికి సూటబుల్ మ్యాచ్ కోసం వెతుకుతున్నట్లు పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus