తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగింది సంఘవి. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఈమె అసలు పేరు కావ్య . ఈమె తండ్రి పేరున్న డాక్టర్ కాగా.. తల్లి సాధారణ గృహిణి. అయితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానన్న మాట సంఘవి విషయంలో నిజమైంది. తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ చేయాలని కలలు కన్నారు కానీ ఈమె డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లి హీరోయిన్ అయ్యింది. 23 సంవత్సరాల పాటు ఈమె హీరోయిన్ గా రాణించింది.
చాలా సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ కలిగిన హీరోయిన్ గా కూడా చేసింది. ‘ప్రేయసి రావే’ ‘సూర్యవంశం’ ‘గొప్పింటి అల్లుడు’ వంటి సినిమాల్లో ఈమె నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలనే పోషించింది. ఆమె రెడీ అంటే ఇప్పుడు కూడా ఆమెకు అలాంటి పాత్రలు లభిస్తాయి కానీ ఆమె ఇలాంటి పాత్రలకు ఓకె చెప్పడం లేదు. ఇక శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాజ్ మహాల్’ చిత్రంతో ఈమె టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1998లో ‘శివయ్య’ సినిమాలో నటిస్తున్న టైంలో ఆ చిత్ర దర్శకుడు సురేశ్ వర్మతో ప్రేమలో పడింది సంఘవి.
తర్వాత వీళ్ళు పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను పెళ్లాడారు సంఘవి. 42 ఏళ్ల వయసులో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా… ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈమె లుక్స్ లో బాగా మార్పులు వచ్చాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!