1987లో కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ ద్వారా హీరోయిన్హా గా పరిచయమైంది శరణ్య. అటు తరువాత ‘నీరాజనం’ ‘సాహసం’ వంటి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు సంపత్ ను ఈమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. అటు తర్వాత ఈమె తమిళ నటుడు పొన్వణ్ణన్ను 1995లో రెండో పెళ్లి చేసుకుంది.
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వాళ్ళ పేర్లు ప్రియదర్శిని, చాందిని. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పెద్ద కుమార్తె పెద్దకుమార్తె ప్రియదర్శిని వివాహం జరిగింది. పెళ్లి సింపుల్ గా చేశారు అటు తర్వాత రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు.ఈ వేడుకకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :