బాలీవుడ్‌లో ఏదో కారణం చేత వైరల్ అయ్యే జోడీల్లో (Shilpa Shetty) శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా ఒకరు. అయితే ఆమె వైపు నుండి, లేదంటే ఆయన వైపు నుండి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రీసెంట్‌గా పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడాకుల రూమర్స్ కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్‌గా వచ్చిన రూమర్… ‘డబ్బుల కోసమే రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి పెళ్లి చేసుకుంది’ అని. ఈ విషయంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చింది.
తాను డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్నట్లు ఇప్పుడు వార్తలు రావడమే కాదు, గతంలో కూడా కొంతమంది ఇలానే భావించారని శిల్పా శెట్టి మాట్లాడింది. అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి మాటలు అనడం సరికాదు అని చెప్పిన ఆమె… ఏం జరిగింది అనే విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరోసారి అని ఎందుకంటున్నాం అంటే… గతంలో కూడా ఈ విషయంలో మాట్లాడింది కాబట్టి.
నా భర్త రాజ్ కుంద్రా ధనవంతుడని అందరికీ తెలుసు. అయితే చాలామంది పెళ్లికి ముందు నా ఆర్థిక స్థితిని ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. పెళ్లి కంటే ముందు తన ఫైనాన్సియల్ స్టేటస్ గురించి ఓ సారి గూగుల్‌లో చెక్ చేసి తెలుసుకోండి అని అంటోంది శిల్పా శెట్టి. ఎందుకంటే తాను అప్పటికే హీరోయిన్‌గా భారీ పారితోషికం తీసుకునేదాన్ని అనేది ఆమె ఉద్దేశం. నేను రాజ్ డబ్బును చూసి ఇష్టపడలేదు. రాజ్ తన చుట్టూ ఉండేవారిపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. అది నచ్చే నేనూ ప్రేమించా అని చెప్పింది.
స్నేహితుల ద్వారా తమ మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని చెప్పి శిల్ప.. ఆయన స్నేహితులే తనకూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పింది. నేను, రాజ్ కలిసి జీవించాలని దేవుడు నిర్ణయించాడు అని క్లారిటీ ఇచ్చింది శిల్ప.
భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!