శ్రియ శరణ్.. 2001లో ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ టైంలోనే అగ్రహీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలందరి పక్కన ఆడిపాడింది. అలాగే స్పెషల్ సాంగ్స్‌లోనూ రచ్చ లేపింది. హిందీ, తమిళ్, మలయాళంతో పాటు ఓ ఇంగ్లీష్ సినిమా కూడా చేసింది. దాదాపు అన్ని భాషల స్టార్స్‌తో జతకట్టి, గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఉపేంద్ర ‘కబ్జ’ మూవీతో కన్నడ ఎంట్రీ ఇస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్‌ని సీక్రెట్‌గా పెళ్లాడింది. మ్యారేజ్ చేసుకున్న విషయం ఆలస్యంగా చెప్పింది. వీరికి ఓ పాప ఉంది.
పిల్ల తల్లి అయినా, వయసు నాలుగు పదులు దాటినా కానీ ఇంకా నాజూకుగా వయ్యారాల వడ్డన చేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. ఫిజిక్, ఫిట్నెస్ పరంగా కుర్ర కథానాయికలకు గట్టిపోటీనిస్తున్న శ్రియ.. రీసెంట్గా గ్లామర్ డోస్ పెంచేస్తూ చేసిన కొన్ని ఫోటోషూట్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవి చూసి కుర్రకారంతా గుటకలు మింగుతున్నారు. ఇన్‌స్టాలో 3.9 మిలియన్ల మంది శ్రియను ఫాలో చేస్తున్నారు.