శృతి హాసన్, తండ్రి కమల హాసన్ దగ్గర నుండి యాక్టింగ్ ని తన కెరీర్ గ మార్చుకుని ఈరోజు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా కెరీర్ లీడ్ చేస్తుంది. హిందీ లక్ తో అచ్తింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన శృతి హాసన్ అనగనగ ఒక ధీరుడు సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయం అయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, మహేష్ బాబు తో శ్రీమంతుడు, మొన్న ఈ మధ్య బాలయ్యతో వీర సింహ రెడ్డి, చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ కొట్టింది. తమిళ్ లో కూడా అజిత్, ధనుష్, లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన శృతి హాసన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ సాలార్ సినిమా చేస్తుంది.
ఇలా హీరోయిన్ గా చాలా బిజీగా ఉంటూనే…మరో పక్క సింగర్ గా చాలా సినిమాల్లో పాటలు పాడుతూ సింగర్ గా తెను ఏంటో ప్రూవ్ చేసుకుంది. చాలా చిన్న వయసులో కమల్ హాసన్ నటించిన క్షత్రియ పుత్రుడు సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చారు సంగీత దర్శకులు ఇళయరాజా. ఈ సినిమాలో ‘పోట్రి పాడేది పొన్నే’ అనే పాత పడితే ఇళయరాజా అప్పుడే తిను పెద్దయ్యాక మంచి సింగర్ అవుతుంది అని చెప్పారు. కట్ చేస్తే శృతి హాసన్ రాజా గారు చెప్పినట్టే మంచి సింగర్ అయ్యింది…ఆక్టర్ కూడా అయ్యింది.
ఈ రోజు బర్త్డే స్పెషల్ గా శృతి హాసన్ పాడిన సాంగ్స్ లో కొన్ని బెస్ట్ సాంగ్స్ చూసేద్దాం…