సంచలన కామెంట్స్ చేసిన శృతిహాసన్!

మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ లాగే ముక్కుసూటి మనిషి. విజయాలతో పాటు వివాదాలు ఆమెకు కొత్తకాదు. తమిళంలో భారీ ప్రాజెక్ట్  ‘సంఘమిత్ర’ నుంచి తప్పుకొని విమర్శలు ఎదుర్కొన్నా.. పెళ్లికాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని కథనాలు వెలువడుతున్నా ఆమె పట్టించుకోలేదు. పైగా ” నా జీవితం నా ఇష్టం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు నాకు ఉంది. అది ప్రేమ కావొచ్చు,  సినిమా కావొచ్చు..’ అంటూ కుండబద్దలు కొట్టింది.

అలాగే  “ప్రతి మనిషికీ అలవాట్లు ఉంటాయి. అలాంటి అలవాట్లే కొన్ని సార్లు వ్యసనాలుగా మారతాయి. కానీ నా విషయంలో అలా జరగదు” అని  కొన్ని రోజుల క్రితం సంచలన కామెంట్స్ చేసిన శృతి ఇప్పుడు మరో సారి తన మాటల్తో  వార్తల్లో ఎక్కింది.  “ఏ విషయంలోనైనా మొహమాట పడొచ్చు కానీ.. తెలియంది నేర్చుకోవడానికి కాదు” అని శ్రుతిహాసన్‌  కొత్త హీరోయిన్స్ కి సూచన ఇచ్చింది. ‘‘ఏ రంగంలోనైనా ఎవరికీ అన్నీ రావు. నేర్చుకుంటూనే ఉండాలి. ఇన్నేళ్ల నుంచి సినిమాల్లో ఉన్న నాకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. నేను ఏమీ పైనుంచి ఊడిపడలేదు . అందరిలాంటి అమ్మాయినే. నాకు వీలైనంతలో కష్టపడి నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. నేను స్టార్‌లతో చాలా సినిమాలు చేసేశాను కాబట్టి నాకు తెలియని విషయమే ఉండదు అనుకుంటే దానంత పొరపాటు మరొకటి ఉండదు.

నాకు రాని విషయం గురించి ఎవరు చెప్పినా వింటాను. నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏదోలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. సిగ్గుపడను’’ అని చెప్పింది. ఆమె మాటలను దక్షిణాది నటీమణులు చాలామంది స్వాగతిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus