Sreeleela: చిన్నచిన్న క్షణాలను కూడా ఆనందించండి.. శ్రీ లీల పోస్ట్ వైరల్!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ శ్రీలీలా. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాక పోయినప్పటికీ ఈ సినిమాలో ఈమె నటనకు మాత్రం ప్రేక్షకుల ఫిదా అయ్యారు. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఇలా తెలుగులో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె అందం అభినయంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శ్రీ లీలా స్టార్ సెలబ్రిటీలను సైతం పక్కకు నెట్టి స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందుకుంటున్నారు.

తాజాగా ధమాకా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తాను షూటింగ్ నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడ దిగినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఓ చిన్న పల్లెటూరులో సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇలా అక్కడ దేవుడి గంటలను కొడుతూ అలాగే పశువులకు గడ్డి తినిపిస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

ఇలా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఈమె షేర్ చేసిన ఫోటోలు చాలా పూర్ క్వాలిటీతో ఉన్నాయని అందుకు తాను క్షమాపణలు కోరడమే కాకుండా ప్రతి చిన్న చిన్న క్షణాలను కూడా ఆనందించాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీ లీల షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus