Sunaina: హీరోయిన్ సునైన చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు!

హీరోయిన్‌ సునైన తన ఇమేజ్‌ను పక్కనపెట్టి ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా మారిపోయారు. తద్వారా తాను కూడా ఒక సాధారణ మహిళనే అని నిరూపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రెజీనా’ షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ఎంతగానో శ్రమించారు. పైగా, దట్టమైన కొండ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్‌ జరిగింది. ఇందుకోసం అవసరమైన సామగ్రిని యూనిట్‌ సభ్యులతో పాటు హీరోయిన్‌ సునైన కూడా మోసుకెళ్ళారు. దీంతో ఈ సినిమా కోసం సాహసం చేసిందంటూ చిత్ర బృందం తాజాగా వెల్లడించింది.

భుజంపై (Sunaina) సునైన ఒక బ్యాగును మోసుకెళ్తున్న ఫొటోను తాజాగా మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రొడక్షన్‌ సిబ్బందితో పాటు ఆమె కూడా కష్టపడటం గమనార్హం. కేరళ రాష్ట్రంలోని తొడుపుళ కొండల్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకోసం అవసరమైన సామాగ్రిని వాహనాల్లో తీసుకెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రొడక్షన్‌ సిబ్బందే లొకేషన్‌ స్పాట్‌కు స్వయంగా మోసుకెళ్లారు. వీరికి సునైన కూడా తన వంతు సాయం చేశారు.

మరోవైపు, ‘రెజీనా’ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి డొమిన్‌ డిసిల్వా దర్శకత్వం వహించగా, సతీష్‌ నాయర్‌ నిర్మాణంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మించారు. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో ఒక యువతి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది.. ఓ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని.. సెన్సార్ నుంచి యుబైఏ సర్టిపికేట్‌ను సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus