టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నారు. ఎన్నో సినిమాలలో తల్లి పిన్ని వదిన అక్క పాత్రలలో నటించిన ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతతో కలిసి పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో తల్లి కూతుర్లు ఇద్దరు చేసే హంగామా మామూలుగా ఉండదు.
ఇలా పొట్టి దుస్తులు ధరించి కూతురితో సమానంగా అందాల ఆరబోతకు పోటీపడుతున్న సురేఖవానికి సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉందని చెప్పాలి.నిత్యం ఎన్నో వీడియోలు ఫోటోషూట్లతో సోషల్ మీడియాని షేర్ చేయడమే కాకుండా కొన్నిసార్లు పెద్ద ఎత్తున నేటిజన్ ల ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. సురేఖ వాణి తన భర్త మృతి చెందిన తర్వాత తన కూతురుతో గడుపుతూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇంటర్వ్యూలో భాగంగా సుప్రీత మాట్లాడుతూ తన తల్లికి రెండో పెళ్లి చేద్దాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే సురేఖ వాణి తనకు పెళ్లి వద్దు బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలంటూ తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీ కూడా చెప్పారు. ఇలా బాయ్ ఫ్రెండ్ గురించి ఈమె చెప్పిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సురేఖ వాణిని యాంకర్ ప్రశ్నిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోకి 100 ముద్దులు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారు అంటూ ప్రశ్నించారు.ఈ క్రమంలోనే సురేఖ వాణి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 100 ముద్దులు పెడతానంటూ సమాధానం చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో కొందరు ఈమెను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఏంటి సురేఖ వాణి మరీ ఇంతలా రెచ్చిపోతే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.