తాజాగా ఓ హీరోయిన్ అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. త్వరలో ఆమె తల్లి కాబోతుందట. ఇంతకీ ఈ న్యూస్ షేర్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ నటి స్వర భాస్కర్. త్వరలో తల్లి కాబోతున్నట్లు ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసి మరీ వెల్లడించింది. ‘అక్టోబర్‌లో తన మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని… మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నట్టు’ చెప్పుకొచ్చింది.
దీంతో స్వర భాస్కర్ కి ‘కంగ్రాట్యులేషన్స్’ చెబుతున్నారు ఆమె ఫాలోవర్లు. ఈ ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 16న స్వర భాస్కర్ సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది.ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. పరిచయం నుండి పెళ్లి వరకు.. తమ జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. ఫహద్.. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అన్న సంగతి తెలిసిందే.
నిజానికి పొలిటీషియన్ అయినప్పటికీ ఫహద్ సంపాదన ఎక్కువ కాదు. (Swara Bhasker) స్వర భాస్కర్ ఇతన్ని ప్రేమించడంతో.. ఇతని ఆస్తి గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంది. 2019 వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన సిఏఏ నిరసనల సమయంలో ఈ జంట కలుసుకోవడం జరిగింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇక స్వర భాస్కర్ 20 కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు