సీనియర్ స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తన గ్లామర్ తో అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను షేక్ చేసింది. ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉందని చెప్పినా అతిశయోక్తి కాదు.కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈమె మరుగున పడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆమెలో ఉన్న విలక్షణమైన నటి అప్పుడే బయటపడింది. అటు తర్వాత మరింత బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తోంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు.
హీరోయిన్లైతేనే అందాలు ఆరబోయలనే ముద్రని సైతం ఈమె చెరిపేసింది. 50 ప్లస్ వయసులో కూడా ఈమె ఫ్యూచర్ ప్లాన్స్ వావ్ అనే లానే ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. “ఇప్పుడు నేను ఎలాంటి పాత్రలైనా చేయడానికి రెడీగా ఉన్నాను. దేనికి కూడా లిమిట్స్ పెట్టుకోలేదు. తల్లి పాత్రనా? అనే సంకోచం లేదు. విలన్ పాత్రనా అనే భయం లేదు. పాత్రకి తగినట్టుగా మలుచుకోగలను.ఏమైనా చేయగలను. ఎప్పుడైతే ఓ నటి ఇమేజ్ ను పక్కన పెట్టి మసులుకుంటుందో అప్పుడు మంచి పాత్రలు దొరుకుతాయి” అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
నిజమే..‘అంధాదున్’ సినిమానే చూసుకుంటే అందులో విలన్ గా నటించింది. ఆమె పాత్రని తెలుగులో తమన్నా (‘మాస్ట్రో’) కానీ… మలయాళంలో మమతా మోహన్ దాస్ కానీ మ్యాచ్ చేయలేకపోయారు.