బాలీవుడ్ నటీమణులు వరుసగా గాయాల పాలవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. హీరోయిన్ శిల్పా శెట్టి ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగంగా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ న్యూస్ వైరల్ అవుతూ ఉండగానే ఇప్పుడు మరో సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కూడా గాయాలపాలయ్యింది.అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోలా చిత్రం షూటింగ్ లో భాగంగా ఈమె గాయపడినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఓ సీన్ లో భాగంగా గ్లాస్ పగిలి టబు కన్నుకి, నుదిటికి బలంగా తగిలిందట. దీంతో వెంటనే యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. సినిమా వాళ్ళ జీవితం చాలా లగ్జరీ గా ఉంటుంది, కాలు కదనవసరం లేదు అని కొంత మంది అనుకుంటారు.
నటీనటులు అనే వాళ్ళు చాలా ప్రమాదాలు, అవమానాలు ఫేస్ చేయాలి అని ఈ సంఘటన ద్వారా రుజువైంది. కూలీ నంబర్ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన టబు అటు తర్వాత నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్న కేశవ రెడ్డి,పాండు రంగడు, అందరివాడు, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.