Tamanna: బాయ్ ఫ్రెండ్ ఎక్కడ తమన్నా… ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్!

  • January 7, 2023 / 08:12 PM IST

హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా ద్వారా తమన్నాకి మంచి గుర్తింపు దక్కటంతో ఆ తర్వాత హీరోయిన్ గా నటించే అవకాశాలు అందుకుంది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో తమన్నా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి రూమర్స్ వినిపించటం చాలా సహజం. ఇక కొన్ని రోజులుగా తమన్నా గురించి కూడా చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ తో తమన్నా ప్రేమలో పడినట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా విజయ్ ని ముద్దు పెట్టుకున్న వీడియో తమన్నా షేర్ చేయటంతో ఈ వార్తలు మరింత ఉపందుకున్నాయి.

ఇలా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలో తమన్నా తాజాగా తన గోవా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం.. మీ ప్రియుడు విజయ్ వర్మ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక మరికొంతమంది మీ లవర్ తో కలసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా విజయ్ వర్మ, తమన్నా గురించి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించనున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus