ఈ సారి త్రిష పెళ్లి ఫిక్సైపోయినట్టేనా?

తరుణ్ హీరోగా వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది త్రిష. ఆ తరువాత 2004లో ప్రభాస్ తో చేసిన ‘వర్షం’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసేసింది. ఆ తరువాత ఈమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా మహేష్ బాబుతో ‘అతడు’, చిరంజీవితో ‘స్టాలిన్’, సిద్దార్థ్ తో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నాగార్జునతో ‘కింగ్’ వంటి సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మరోపక్క తమిళంలో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చింది త్రిష. ఇండస్ట్రీకి వచ్చి 21 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

’96’ వంటి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ కుర్ర హీరోయిన్లకు ఝలక్ లు ఇస్తూనే వస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో కూడా ఈమె వార్తలో నిలుస్తూ ఉంటుంది. గతంలో ప్రముఖ బిజినెస్ మెన్ వరుణ్‌ మణియన్‌తో త్రిషకు ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ తరువాత సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె పెళ్లి చేసుకోబోయే స్టార్ హీరో మరెవరో కాదు శింబు.

గతంలో కూడా శింబు,త్రిష ల మధ్య ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శింబు మాత్రం పెద్ద ప్లే బాయ్ అన్న సంగతి తెలిసిందే. ఇతనితో కలిసి సినిమాలు చేసే ప్రతీ హీరోయిన్ ను లైన్లో పెట్టేసి డేటింగ్ చేస్తూ ఉంటాడు ఈ రసిక్ రాజా. నయన తారతో ఇతను నడిపిన ప్రేమాయణం ఎన్నో వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి హీరోని త్రిష.. తెలిసి తెలిసి పెళ్లి చేసుకుంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలీదు కానీ.. ఇప్పుడు మాత్రం తెగ వైరల్ అవుతుంది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus