Trisha: త్రిష నటించిన కొత్త సినిమా ఇదేనా?

‘పీఎస్ 2’ తరువాత, త్రిష ఎటువంటి ప్రాజెక్ట్ వస్తోందని అందరికి కుతూహలంగా ఉండే, ఆసక్తికరం ఏంటంటే ఆమె మొదటి సారిగా ఒక వెబ్ సిరీస్ చేసింది. అందులో త్రిష ఎటువంటి పాత్ర చేస్తోందో తెలుసా… త్రిష దక్షిణ భారతదేశ సినిమాలో ఇప్పటికీ అగ్రతారగా వెలుగుతున్న నటి. 20 ఏళ్లకు పైబడి సినిమా రంగంలో ఉంటూ ఇంకా అగ్ర తారగా ఉండటం అంత సులువైన విషయం కాదు. కానీ త్రిష ఆలా కంటిన్యూ గా సినిమాలు చేస్తూ మొదట్లో ఎలా వుందో అంతే గ్లామర్ గానే ఇప్పుడు కూడా వుంది.

మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పీఎస్ 2’ రానున్న శుక్రవారం విడుదల అవుతోంది. ఇది ‘పీఎస్ 1’ కి రెండో పార్ట్ గా వస్తోంది. ఇందులో త్రిష ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే త్రిష, లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె ‘పీఎస్ 2’ తరువాత ఎటువంటి సినిమా విడుదల అవుతుందని ఆమె అభిమానులకు సందేహం వుంది. కానీ త్రిష మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది, ఆ వెబ్ సిరీస్ టైటిల్ ‘బృంద’.

దీనికి తెలుగు దర్శకుడు సూర్య వంగల దర్శకత్వం వహించగా, ఆశిష్ కొల్ల దీనికి నిర్మాత. ఇది సోనీ లివ్ కోసం నిర్మిస్తున్న వెబ్ సిరీస్. ఇది పోలీస్ నేపధ్యం లో వస్తున్న సినిమా. ఇందులో క్రైమ్ ఎలిమెంట్, నేరపరిశోధన ఇంకా చాలా ఎలెమెంట్స్ వున్నాయి. ఇది ఎనిమిది ఎపిసోడ్స్ కాగా మొదటి సీజన్ లో వస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో త్రిష ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రని వేస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండబోతోంది అని తెలిసింది.

అయితే మొదటి సారిగా త్రిష (Trisha) చేస్తున్న వెబ్ సిరీస్ ఇదే అవటం ఆసక్తికరం. ఎందుకంటే ఆమెకి ఈ కథ నచ్చి ఇది చేస్తానని వెంటనే ఒప్పుకోవటం. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా విడుదల అవుతుంది. ‘ఫామిలీ మేన్’ లో నటించిన చాలామంది నటులను ఈ వెబ్ సిరీస్ లో తీసుకున్నారని కూడా తెలిసింది. ‘పొన్నియన్ సెల్వన్ 2’ విడుదల అయినా తరువాత త్రిష విడుదల ఈ వెబ్ సిరీస్ మాత్రమే. ఇది జూన్, జులై లో విడుదల కావచ్చు అని తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలిసింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus