Varalaxmi Sarathkumar: రెండు ఓకే… ఇంకొన్ని కూడా ఉన్నాయట!

ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది వరు అలియాస్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌. తొలినాళ్లలో కథానాయికగా రాణించినా… తర్వాతర్వాత ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయడం మొదలుపెట్టింది. కేవలం హీరోయిన్‌ పాత్రలు మాత్రమే కాకుండా… మంచి పాత్ర అంటే విలన్‌ అవ్వడానికీ సిద్ధమైంది. అలా తమిళనాట లేడీ విలన్‌ ఎస్టాబ్లిస్‌ అయ్యింది. ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ఓకే చేసుకుంటోంది.

‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చింది వరు. ఆ సినిమా ఆశించిన విజయం ఇవ్వకపోయినా, మన దర్శకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత సరైన పాత్ర కోసం వెయిట్‌ చేసి, చేసి ‘క్రాక్‌’తో ఈ ఏడాది బ్యాంగ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆమె యాసకి, కటౌట్‌కి ఫ్యాన్స్‌ ‘రీసెంట్‌ బెస్ట్‌ లేడీ విలన్‌’ అనేంతగా ఆ పాత్రకు సెట్‌ అయ్యింది వరు. ఆ వెంటనే నేను ఓన్లీ విలన్‌ మాత్రమే కాదు అంటూ… ‘నాంది’లో లాయర్‌ పాత్రలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణించింది. ఇప్పుడు కొత్తగా ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయట.

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కాంబో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అందులో వరలక్ష్మిని తీసుకున్నారని ఇటీవల ప్రకటించారు. ఇందులో కీలకమైన ప్రతినాయిక పాత్రను వరు పోషిస్తోందట. మరోవైపు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘హను మాన్‌ ’ సినిమాలోనూ వరును తీసుకున్నారట. ఇది కాకుండా మరో రెండు సినిమాల చర్చలు తుది దశకు వచ్చాయట. అందులోనూ అవి పెద్ద హీరోల సినిమాలే అంటున్నారు కూడా. మరి వాటిలో ఎలా కనిపిస్తుందో చూడాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus