పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను శారీరకంగా వాడుకున్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్!

సినీ పరిశ్రమలో నటీమణులు తాము ఎదుర్కొన్న కష్టాలను మీడియా, సోషల్ మీడియా ముఖంగా వెల్లడించడం అనేది కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ సంగతి మాత్రం అందరికీ కొత్తగా.. ఇంకో విధంగా షాకింగ్ గా అనిపించవచ్చు. వివరాల్లోకి వెళితే.. ఒకప్పటి హీరోయిన్ విజయలక్ష్మి అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘హనుమాన్ జంక్షన్’ ‘పృథ్వీ నారాయణ’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాగ మండలం’ అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత కన్నడ, తెలుగు, మలయాళ ,తమిళ భాషల్లో కలుపుకుని 40 వరకు సినిమాల్లో నటించింది. ఈమెను తమిళ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత అయిన సీమాన్.. 7 సార్లు కడుపు చేసి అబార్షన్ చేయించినట్టు ఈమె సంచలన అరోపణలు చేసి వార్తల్లోకెక్కింది. ఆమె మాట్లాడుతూ..” సీమాన్.. పెళ్లి పేరుతో నమ్మించి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. ప్రేమిస్తున్నట్టు నమ్మించి.. పడక సుఖం కోసం నన్ను శారీరకంగా వాడుకుని 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడు.

నా బంగారు నగలు కూడా అతను తీసుకొని .. తిరిగి వాటిని అప్పగించింది లేదు” .. అంటూ విజయలక్ష్మీ ఆరోపణలు చేసింది. తర్వాత పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసింది. ఆమె కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు.. సీమాన్ను విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. కానీ సీమాన్ విచారణకు హాజరు కాలేదు.

అయినప్పటికీ మరోసారి పోలీసులు నోటీసులు పంపడం జరిగింది. ఈ క్రమంలో విచారణకు హాజరైన సీమాన్ను పోలీసులు చాలా సేపు విచారించారు. మరోపక్క అబార్షన్ ఆరోపణలను కూడా ఆధారం చేసుకుని విజయలక్ష్మికి (Vijayalakshmi) మెడికల్ టెస్టులు కూడా వారు నిర్వహించినట్లు సమాచారం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus