వేణు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

‘హనుమాన్ జంక్షన్’ సినిమాలో హీరో వేణుకి (Venu) లవర్ గా నటించిన విజయలక్ష్మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమెను ఓ కన్నడ నటుడు పెళ్లి చేసుకోకుండా వాడుకున్నాడు అంటూ మీడియాని, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విజయలక్ష్మీ ఆరోగ్యం కూడా ఇప్పుడు బాలేదు. ఈ క్రమంలో సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది విజయలక్ష్మీ వీడియో ద్వారా మాట్లాడుతూ.. ” ప్రియమైన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం.

ఫిబ్రవరి 29న ఓ వీడియో పోస్ట్ చేశాను.. ‘నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్’ నాతో మాట్లాడాలని.. నాతో కలిసి జీవించాలని కోరాను. ఇప్పుడు మార్చి 5వ తేదీ పూర్తయ్యింది.. నేను చాలా మనోవేదనకు గురయ్యాను, దుఖఃముతో ఆ వీడియో పంపించా. నువు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాను. పెళ్లి చేసుకుంటా అని 3 ఏళ్ళ పాటు నన్ను వాడుకున్నాడు. నా జీవితం మొత్తం నాశనం చేశాడు. ఇప్పుడు నన్ను రోడ్డుపై వదిలేశాడు.

ఇప్పుడు నాకు సాయం చేసే వాళ్ళు లేరు.నన్ను కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. నాకు సాయం చేస్తాను ఎవరైనా వచ్చినా వాళ్ళని వేధించి, తరిమి కొడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను.. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా.. కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారు. నా (Vijayalakshmi) మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus