Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

ఇప్పుడు మనం చాలా మీమ్స్‌లో చూస్తున్న, చాలా రీల్స్‌లో వింటున్న ‘అవునవును.. కాదు కాదు’ అనే డైలాగ్‌కి రాసింది ఎవరైనా మంచి రిథమ్‌లో చెప్పింది మాతకనం వత్సల రాజగోనాల్‌. ‘అదుర్స్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ బామ్మ పాత్రలో నటించి మెప్పించిన వత్సల రాజగోపాల్‌ (93) ఇటీవల కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కేరళలోని తిరువనంతపురంలో పుట్టిన వత్సల పెళ్లయిన తర్వాత చెన్నైకు వచ్చి స్థిరపడ్డారు.

Vathsala Rajagopal

కార్టూనిస్ట్‌ శ్రీధరన్‌ నిర్వహించిన ‘రసిగ రంగ’ థియేటర్‌ గ్రూపులో 1979లో చేరిన వత్సల రంగస్థల కళాకారిణిగా కెరీర్‌ ప్రారంభించారు. 1990ల కాలంలో తమిళ టీవీ సీరియల్స్‌లో నటించారు. వాటిలో ఆమె ఆకట్టుకోవడంతో ‘రోజా’ (1992) సినిమాలో మణిరత్నం అవకాశం కల్పించారు. అప్పటికే ఆమె వయసు 60 ఏళ్లు. అలా లేటు వయసులో సినిమాల్లోకి వచ్చిన వత్సల రంగస్థలంలోనే 450 నాటకాలు వేశారు.

తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో కలుపుకుని దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె కెరీర్‌లో ‘సతీ లీలావతి’, ‘రిథమ్‌’, ‘అపరిచితుడు’, ‘అదుర్స్‌’ లాంటి హిట్‌ సినిమాలు ఉన్నాయి. ‘అదుర్స్’ సినిమాలో చారి (ఎన్టీఆర్) పాత్రకు బామ్మగా నటించారు. ఆ సినిమాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బామ్మగా ఎన్టీఆర్‌తో ఆమె చేసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అందులోనిదే ‘అవునవును కాదు కాదు’ డైలాగ్‌.

 ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus