తండ్రీ కొడుకులూ ఇద్దరూ డైరక్షన్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి.. అయితే ఇద్దరూ డైర్టర్‌లు కాదు అని కాదు అని అంటే.. తండ్రి డైరక్టర్, కొడుకు అసిస్టెంట్ డైరక్టర్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కొడుకు డైరక్టర్, తండ్రి అసోసియేట్ డైరక్టర్. అవును మీరు చదివింది కరెక్టే. ఆ కొడుకు ఇప్పుడు స్టార్ డైరక్టర్ కూడా. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి వైవిధ్యమైన పరిస్థితి కోలీవుడ్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డైరక్టర్ అక్కడివాడే. అతనే అధిక్ రవిచంద్రన్.
అవును, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటూ గతేడాది భారీ హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు ‘డేర్ డెవిల్’ అంటూ అదే అజిత్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం ఒకటి చెప్పుకొచ్చారు. తన తండ్రి రవి కందస్వామి త్వరలో దర్శకుడు అవుతున్నారు అని చెప్పారు. అంతేకాదు ఆ సినిమాతో మను రవిచంద్రన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా చేస్తారు అని కూడా చెప్పారు. ఈ సినిమా కథ అధిక్ రవిచంద్రన్ అందిస్తున్నారు.
మరో రెండు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అనౌన్స్ చేస్తారట. ఇదే జరిగితే తండ్రి దర్శకుడు అవ్వడానికి కొడుకు కథ ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా విషయానికొస్తే.. ఆ సినిమాకు ఆధిక్ రవిచంద్రన్ అసోసియేట్ డైరెక్టర్‌గా చేశారు. ఆ సినిమానే కాదు ఆధిక్ మొదటి సినిమా నుండి ఇలానే ఆయన తండ్రి పని చేస్తున్నారట. బాగుంది కదా ఈ జర్నీ.
‘డేర్ డెవిల్’ సినిమా విషయానికొస్తే.. కొన్ని ఏళ్ల గ్యాప్ తర్వాత అజిత్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత షాలినినే. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమానే అవుతుంది. ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోందని సమాచారం. త్వరలో సినిమా అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా వస్తాయని చెబుతున్నారు.