యువ కథానాయకుడు విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కల్ట్’. ఈ సినిమా జోనర్ మనకు కొత్త.. ఎవరూ ఊహించని కథతో సినిమా చేస్తాం అంటూ సినిమా విడుదల అయ్యేంతవరకు చిత్రబృందం చెబుతూనే వచ్చింది. అయితే సినిమా వచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయింది. దానికి కారణం సినిమాకు వచ్చిన రెస్పాన్స్, అంతేకాదు సినిమా మీద వచ్చిన విమర్శలు. ఈ విమర్శల్లో కొత్త పాయింట్ ఒకటి యాడ్ అయింది. అదే సినిమాలోని కొన్ని ఇబ్బందికర డైలాగ్‌లు బయటకు రావడమే.
‘కల్ట్’ సినిమాకు సంబంధించి సెన్సార్ దగ్గర చాలా కత్తెరలు పడ్డాయి అని సమాచారం. అందులో కొన్ని డైలాగ్‌లు రిలీజ్ రోజు ఓ థియేటర్‌లో వేసేశారు అని చెబుతున్నారు. మామూలుగా అయితే సినిమాల్లో అసభ్య పదజాలం ఉన్నప్పుడు బీప్స్ వేయడం లేదా అభ్యంతరకరమైన పదాలను తొలగించడం లాంటివి చేస్తుంటారు. అయితే ‘కల్ట్’ సినిమాకు ఓ థియేటర్‌లో వేసిన షోలో అసభ్య పదజాలం వినిపించిందని చెబుతున్నారు.
సినిమాలో కొన్ని డైలాగుల్లో నేరుగా వినిపించడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారట. దీంతో కొంత ఇబ్బంది కూడా పడ్డారని చెబుతున్నారు. దీంతో ఆ థియేటర్‌లో ప్రదర్శించిన వెర్షన్ సెన్సార్ ఆమోదించిన కాపీనేనా అనే చర్చ మొదలైంది. ఒకవేళ సెన్సార్ బోర్డ్ ఆమోదించిన వెర్షన్ అయితే అలాంటి మాటలు ఎందుకు వచ్చాయి అనేది ప్రశ్నగా మారింది. ఆ తప్పు ఒక్క థియేటర్‌కే పరిమితం అయిందా? లేక అన్ని థియేటర్లలో ఇదే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
‘కల్ట్’ సినిమా విషయానికొస్తే.. రిలీజ్‌కి ముందు వరకు వచ్చిన బజ్.. తొలి షో పడ్డాక మొత్తం పోయింది. సినిమా పరిస్థితి అర్థమైందో ఏమో.. ఆ తర్వాత చిత్రబృందం నుండి ఎలాంటి ప్రచారం అయితే లేదు. సోమవారం నుండి ఏమైనా ప్రచారం షురూ చేస్తారేమో చూడాలి.