నిన్న అంటే జూన్ 6 న సాయంత్రం తిరుమలలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే దానికి ముందు చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆలయం ముందు హీరోయిన్ కృతి సనన్ కు దర్శకుడు ముద్దు పెట్టడం సంచలనంగా మారింది. బుధవారం వేకువజామున అర్చన సేవలో పాల్గొన్న ఆడిపురుష్ టీం, శ్రీవారి దర్శనంతరం..
ఆలయం బయటికి వచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ కృతి సనన్ కొంత ఆలస్యంగా వచ్చిందని భావించి డైరెక్టర్ ఓం రౌత్ వాళ్ళ స్టైల్ లో ఆమెకు ఆహ్వానం పలుకుతూ కౌగిలించుకుని బుగ్గపై ముద్దులు పెట్టాడు.దీంతో వీళ్ళ పై ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయం పై ఆదిపురుష్ టీమ్ మాట్లాడుతూ.. హీరోయిన్ కు ఫ్లైట్ టైమ్ అవ్వడంతో దర్శన అనంతరం హడవుడిగా బయలుదేరడం జరిగింది. అందువల్ల డైరెక్టర్ ఓం రౌత్ ఆమెకు ప్రేమగా గుడ్ బై చెప్పడం జరిగింది.
అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు… అంటూ వారు చెప్పుకొచ్చారు. అయినా తిరుమలలో ఏమాత్రం తేడాగా ప్రవర్తించినా పెద్ద రచ్చ అయిపోతుంది.గతంలో నయన్ – విఘ్నేష్ దంపతులు కూడా వివాదంలో ఇరుక్కున్నారు. నయన్ చెప్పులు వేసుకుని ఆలయ ప్రాంగణంలో తిరిగినందుకే… పెద్ద రచ్చ చేశారు. ఇక ఆదిపురుష్ డైరెక్టర్ హీరోయిన్ కు ముద్దులు పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. పైగా సీత పాత్ర పోషించిన హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) కాబట్టి.. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఛి ఛి ఇదేం పాడుబుద్ది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు