Adipurush Collections: ‘ఆదిపురుష్’ ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసింది.. నష్టమెంత?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16 న రిలీజ్ అయ్యింది.మొదటి షోతోనే సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్’ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. భారీ ఓపెనింగ్స్ ను సాధించినప్పటికీ ఈ సినిమా ఆ తర్వాత చేతులెత్తేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 38.75 cr
సీడెడ్ 10.65 cr
ఉత్తరాంధ్ర 10.68 cr
ఈస్ట్ 6.22 cr
వెస్ట్ 5.00 cr
గుంటూరు 6.75 cr
కృష్ణా 5.15 cr
నెల్లూరు 2.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 85.80 cr
హిందీ 70.21 cr
తమిళ్ 2.47 cr
కర్ణాటక 12.43 cr
కేరళ 0.87 cr
ఓవర్సీస్ 24.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 196.58 cr

‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ .. రూ.196.58 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.33.42 కోట్ల నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus