స్టార్ డైరెక్టర్ కు ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ షాకిచ్చిన వేళ..!

‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి యంగ్ హీరోల సినిమాల్లో కూడా నటించి తిరుగులేని స్టార్ డం ను సంపాదించుకుంది. తరువాత ఆర్తి అగర్వాల్ రిఫరెన్స్ తో.. ఆమె చెల్లి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన ‘గంగోత్రి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అదితి అగర్వాల్. ఆ చిత్రంలో తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

దాంతో ‘తన అక్కలానే అదితి కూడా స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమని’ అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకోకపోవడం వలనో ఏమో కానీ.. ఈమె ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. ఇదిలా ఉండగా.. అదితి కెరీర్ ప్రారంభంలో కృష్ణవంశీ వంటి స్టార్ డైరెక్టర్ కే నో చెప్పిందట. అసలు విషయం ఏమిటంటే.. నితిన్, ఛార్మీ హీరో హీరోయిన్లుగా కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో హీరోయిన్ గా మొదట అదితి అగర్వాల్ ను సంప్రదించాడట కృష్ణవంశీ.

అందుకు అదితి కూడా ఓకే చెప్పేసింది. అయితే సెట్స్ పైకి వెళ్లిన తరువాత.. ‘ఈ సినిమాలో గ్లామర్ సన్నివేశాలు శృతిమించి ఉన్నాయని చెప్పి’ ఆమె తప్పుకుందట. తరువాత యూనిట్ సభ్యులు కాల్ చేసి ఆమెను సంప్రదించినా .. ‘పెద్ద డైరెక్టర్ కాబట్టి మీ కెరీర్ కు ప్లస్ అవుతుంది అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా’ అదితి ఒప్పుకోలేదట. ఇక సినిమా విడుదలయ్యాక రిజల్ట్ తెలుసుకుని.. ‘రిజెక్ట్ చేసి మంచి పనే చేశాను’ అని ఫీలైనట్టు కూడా అదితి తెలిపిందట.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus