Siddharth: పాపం సిద్దార్థ్ కి.. గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ కూడా కలిసి రాలేదు!

హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్కర్’ నిన్న(జూన్ 9న) రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా చెప్పుకునే రేంజ్లో లేవని టాక్. అయితే సినిమాపై సిద్ధార్థ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి రెండు చోట్లా ప్రమోషన్స్ గట్టిగానే చేశాడు.

దీని కోసం తన (Siddharth) రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ని కూడా వాడేశాడు. హీరోయిన్ అదితి రావు, సిద్దార్థ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. కానీ, ఆ విషయాన్ని బయటికి చెప్పరు. కెమెరా ముందుకు కలిసొచ్చి వీళ్ళు ఫోజులు ఇవ్వరు. కానీ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఒకే ఇంట్లో ఉంటున్నారు. అది కూడా ఒప్పుకోరు.

సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. కానీ మీడియా ముందు మాత్రం మా మధ్య ఏమీ లేదు అంటున్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఆదితి రావు తన సోషల్ మీడియా ఖాతాల్లో ‘టక్కర్’ సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నారు.

పాట బాగుంది అంటూ ఒకసారి, విడుదల తేదీ గురించి మరోసారి పోస్టులు పెట్టింది. విడుదల రోజున కూడా ‘టక్కర్’ టీంకి ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ పెట్టింది. అయినా సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు అనే కామెంట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus