భారతీయ సినిమాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ఎక్కువ శాతం జీవిత కథలే. సమాజంలో ఏదో రంగంలో ప్రాముఖ్యత సాధించిన, పేరు తెచ్చుకున్న మహిళల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చినప్పుడు… అప్పడు అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా మారిపోతుంది. ఓ పది శాతం సినిమాల విషయంలో ఈ కాన్సెప్ట్ పని చేయకపోవచ్చు. అలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చూస్తోంది అదితి రావ్ హైదరి. ‘మహా సముద్రం’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అదితీరావ్ హైదరీ ఇటీవల మీడియాతో మాట్లాడింది.
ఈ క్రమంలో తన మనసులో మాటల్ని బయట పెట్టింది. ఆ లెక్కన ఇద్దరి జీవిత కథల్లో నటించాలనే తన కోరికని బయట పెట్టింది. అందులో ఒకరు ప్రముఖ నటి రేఖ. అదితిరావ్ హైదరీ… ప్రేమగా ‘రేఖమ్మ’ అని పిలుచుకునే రేఖ జీవిత కథ చేసే అవకాశం వస్తే వెంటనే ఓకే చెప్పేస్తా అని తెలిపింది. ఇది కాకుండా… అదితికి వ్యక్తిగతంగా సంగీతమంటే చాలా ఇష్టమట. అందుకే అవకాశమొస్తే ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించాలనుంది అని మనసులో మాట బయట పెట్టింది.
చూద్దాం ఈ ఇద్దరి బయోపిక్స్ ఎవరు తీస్తారో, తీస్తే అదితికి అవకాశం ఇస్తారే లేదో. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పడితే తనేంటో నిరూపించుకుంది అదితి. మరోసారి ఆ వైవిధ్య నటిని మనం చూడొచ్చు. ఆ సినిమాలు వస్తే!
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు