కొంతమంది ప్రతిభ చూస్తే భలే ముచ్చటేస్తుంటుంది. అందులో ఆ ప్రతిభ చూసిన వ్యక్తి కుర్రాడు అయితే ఇంకా ముచ్చటేస్తుంది. అలాంటి ఫీలింగ్ ప్రస్తుతం ఇస్తున్న కుర్రాడు ఆదిత్య హాసన్. ‘90స్’ వెబ్ సిరీస్‌తో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఓటీటీగా నిలిచిన ఆదిత్య… ఇప్పుడు ‘ప్రేమలు’ (Premalu) సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. మలయాళం బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ప్రేమలు’ సినిమా తెలుగు వెర్షన్ మార్చి 8న రిలీజ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం అందుకుంది.
ఈ సినిమా తెలుగులో ఇంత మంచి టాక్ తెచ్చుకోవడానికి ఓ కారణం తెలుగు డైలాగ్స్ రాసిన ఆదిత్య హాసన్ అని చెప్పొచ్చు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్‌తో ఆదిత్య హాసన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 90s కిడ్స్ అంతా ఆ సిరీస్ చూసి ఆ రోజుల్లోకి వెళ్లిపోయి మురిసిపోయారు. ఆ సిరీస్‌తో తన పెన్ పవర్ చూపించిన ఆదిత్య ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు డైలాగ్స్ రాసి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.
మలయాళం ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా భలే రాశారు అని అంటున్నారు రెండు భాషల్లోనూ చూసినవాళ్లు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ పేరు కూడా ఆదిత్య డైలాగుల్లో వినిపించింది. అంటే ఇప్పటి ట్రెండ్‌ని పట్టుకుని డైలాగ్‌లు రాస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే… వారం రోజుల్లోనే డైలాగ్స్ పూర్తి చేశారట. ఇలాంటి సినిమాకు వారం రోజుల్లో డైలాగ్ వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు అంటున్నారు విమర్శకులు.
ఇక ఆదిత్య ప్రాజెక్టులపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. నితిన్‌తో ఆదిత్య హాసన్ ఓ సినిమా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆ కథ ఎలా ఉంటుందో తెలియదు కానీ ‘90 స్’, ‘ప్రేమలు’ మ్యాజిక్‌ను మరోసారి చేస్తే ఆ సినిమా విజయం సాధించడం పక్కా అని చెబుతున్నారు. చూద్దాం ఆదిత్య స్ట్రయిట్ మూవీ ఎలాంటి కథతో వస్తారో?