Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Reviews » Bhimaa Review in Telugu: భీమా సినిమా రివ్యూ & రేటింగ్!

Bhimaa Review in Telugu: భీమా సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 8, 2024 / 04:57 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Bhimaa Review in Telugu: భీమా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • గోపీచంద్‌ (Hero)
  • ప్రియా భవానీ శంకర్‌ , మాళవిక శర్మ (Heroine)
  • వెన్నెల కిషోర్ , నాజర్ ,నరేష్ , పూర్ణ , రఘు బాబు , చమ్మక్ చంద్ర, రోహిణి (Cast)
  • ఏ. హర్ష (Director)
  • కేకే రాధామోహన్‌ (Producer)
  • రవి బస్రుర్ (Music)
  • స్వామి జె గౌడ (Cinematography)
  • Release Date : మార్చి 08, 2024
  • శ్రీ సత్య సాయి ఆర్ట్స్ (Banner)

మాస్ హీరో గోపీచంద్ (Gopichand)  కన్నడ డైరెక్టర్ (Harsha) హర్ష దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం (Bhimaa)  “భీమా”. “గౌతమ్ నంద” (Goutham Nanda) అనంతరం గోపీచంద్ ద్విపాత్రాభినయం పోషించిన చిత్రమిది. విడుదలైన ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. చాన్నాళ్లుగా సరైన కమర్షియల్ హిట్ లేని గోపీచంద్ కు “భీమా” ఏమేరకు ప్లస్ అయ్యిందో చూద్దాం..!!

కథ: ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ దారుణంగా హతమార్చగా.. ఆ కేస్ ను డీల్ చేసేందుకు వచ్చిన రౌడీపోలీస్ ఆఫీసర్ భీమా (గోపీచంద్). భవానీ (ముఖేష్ తివారీ) & గ్యాంగ్ ను ఎదుర్కొని నిలబడి వారి అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంటాడు. ఈ క్రమంలో భవానీ చేస్తున్న ఓ ఘోరమైన విషయం భీమాకి తెలుస్తుంది. అసలు ఏమిటా ఘోరమైన విషయం? భీమా దాన్ని ఎలా తుదముట్టించాడు? ఈ క్రమంలో భీమా ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “భీమా” చిత్రం.


నటీనటుల పనితీరు: రెండు వైవిధ్యమైన పాత్రల్లో గోపీచంద్ మరోమారు తన సత్తా చాటుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన శైలి నటనతో అలరించాడు. (Malvika Sharma) మాళవిక శర్మ అందాల ఆరబోతతో సర్దుకుపోగా.. ప్రియభవానీ శంకర్ (Priya Bhavani Shankar) కాస్త పర్వాలేదనిపించుకుంది. (Vennela Kishore) వెన్నెలకిషోర్, (Raghu Babu) రఘుబాబు, (Naresh) నరేష్, (Sapthagiri) సప్తగిరీలు నవ్వించడానికి ప్రయత్నించారు. చాన్నాళ్ల తర్వాత (Nassar) నాజర్ కి మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ లభించింది. ఆయన మేకప్ సరిగా లేకపోయినా, నటుడిగా మాత్రం అదరగొట్టాడు.

సాంకేతికవర్గం పనితీరు: రవి భస్రూర్ (Ravi Basrur) పాటల కంటే నేపధ్య సంగీతం బాగుంది. స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ & లైటింగ్ సినిమాకి మంచి మాస్ ఎలివేషన్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. కన్నడ దర్శకుడు హర్ష మాస్ ఎలిమెంట్స్ వరకూ విశేషంగా ఆకట్టుకున్నాడు.

అయితే.. లవ్ ట్రాక్ & కామెడీ విషయంలో మాత్రం అలరించలేకపోయాడు. ముఖ్యంగా హీరోయిన్ తో టీచర్ కమ్ స్టూడెంట్ పాత్ర పోషింపజేసి, సరస్వతీదేవిలా చూపించాల్సిన పాత్రను రతీదేవిలా చిత్రించడం అనేది మింగుడుపడని విషయం. కేవలం మాస్ ఫైట్స్ మీదనే కాక కథనం మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.

విశ్లేషణ: లాజిక్స్ తో సంబంధం లేని మాస్ ఎలివేషన్స్ & ఫైట్స్ ను ఎంజాయ్ చేసే కమర్షియల్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే సినిమా “భీమా”. గోపీచంద్ ద్విపాత్రాభినయం, యాక్షన్ బ్లాక్స్ & క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

ఫోకస్ పాయింట్: మాస్ ఆడియన్స్ మెచ్చే కమర్షియల్ “భీమా”

రేటింగ్: 2.25/5

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A harsha
  • #Bhimaa
  • #Gopichand
  • #Malvika Sharma
  • #Priya Bhavani Shankar

Reviews

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

trending news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

5 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

7 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

9 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

9 hours ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

10 hours ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

6 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

7 hours ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

7 hours ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

7 hours ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version