Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Gaami Review in Telugu: గామి సినిమా రివ్యూ & రేటింగ్!

Gaami Review in Telugu: గామి సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 8, 2024 / 12:10 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Gaami Review in Telugu: గామి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విశ్వక్‌సేన్‌ (Hero)
  • చాందిని చౌదరి (Heroine)
  • అభినయ , మహ్మద్ సమద్, హారిక పెడద , దయానంద్ రెడ్డి , శరత్ కుమార్ (Cast)
  • విద్యాధర్‌ కాగిత (Director)
  • కార్తీక్‌ శబరీష్‌ , శ్వేతా మొరవనేని (Producer)
  • నరేష్ కుమారన్ (Music)
  • విశ్వనాథ్‌రెడ్డి చెలుమళ్ల రాంపి నందిగాం (Cinematography)
  • Release Date : మార్చి 08, 2024
  • తమడా మీడియా , కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ , వీ సెల్యులాయిడ్ , వీఆర్ గ్లోబల్ మీడియా క్లౌన్ పిక్చర్స్ (Banner)

ప్రతివారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవ్వడం, సినిమా కంటెంట్ బట్టి అది హిట్ లేదా ఫ్లాప్ అని మొదటి ఆటకే డిసైడ్ అవ్వడం వంటివి టకటకా జరిగిపోతుంటాయి. అయితే.. ఈవారం విడుదలైన (Gaami) “గామి” మాత్రం ఈ రెగ్యులర్ లిస్ట్ కి మినహాయింపు. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా 2018లో మొదలైన ఈ చిత్రం చాలా కష్టాలు కోర్చి ఎట్టకేలకు నేడు (మార్చి 08) విడుదలైంది. విశ్వక్ సేన్ (Vishwak Sen) టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి (Vidyadhar Kagita) విద్యాధర్ దర్శకుడు. మరి చిత్రబృందం దాదాపు ఆరేళ్లపాటు పడిన కష్టాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది చూద్దాం..!!

కథ: అఘోరాల మధ్య పెరిగుతాడు శంకర్ (విశ్వక్ సేన్). ఎవరైనా ముట్టుకుంటే విపరీతమైన నొప్పికి లోనయ్యే వ్యాధితో నరకం చూస్తుంటాడు. ఈ నొప్పి నుండి బయటపడాలంటే.. ద్రోణగిరిలో 36 ఏళ్లకోసారి వికసించే మాలిపత్రాలు (పుట్టగొడుగులు) సాధించాలి. అత్యంత క్లిష్టమైన ఈ పయనంలో శంకర్ కి జాహ్నవి (చాందిని చౌదరి) (Chandini Chowdary)  తోడుగా వస్తుంది. కట్ చేస్తే.. దక్షిణభారతంలోని ఓ గ్రామంలో దేవదాసీ వ్యవస్థ కారణంగా దుర్గ (అభినయ) (Abhinaya) జీవితం నాశనం అవుతుంది, తన బాధ కూతురు పడకూడదు అని ఉమ (హారిక పెదాడ)ను ఊరు నుండి బయటకు పంపించాలనే ప్రయత్నంలో కన్ను మూస్తుంది.

అదే తరుణంలో.. మంచు కొండల్లోని ఎవరికీ తెలియని ఒక ల్యాబొరేటరీలో మనిషి బ్రెయిన్ ను కంట్రోల్ చేయడానికి ప్రయోగం జరుగుతుంటుంది. ఆ ప్రయోగాన్ని సబ్జెక్ట్ 333 (Mohammad Samad) (మహమ్మద్ సమద్) మీద నిర్వహిస్తుంటారు. అక్కడ్నుంచి ప్రాణాలతో బయటపడి ఒక సాధారణ జీవితం సాగించాలని కోరుకుంటాడు సబ్జెక్ట్ 333. ఈ ముగ్గురికి ఉన్న సారూప్యత ఏమిటి? వీరి ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులేమిటి?

నటీనటుల పనితీరు: విశ్వక్ సేన్ ఒక డేరింగ్ రోల్ చేసాడు. నిజానికి ఈ తరహా పాత్రను మరో స్టార్ హీరో అయితే యాక్సెప్ట్ చేసి ఉండదు. ఈ సినిమా కోసం అతడు పడిన కష్టం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మహమ్మద్ సమద్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ ప్రయోగశాలలో చిక్కుకున్న ఎలుకలా అతడి పాత్రని ప్రెజంట్ చేసిన తీరు, ఆ పాత్రలో అతడు జీవించిన విధానం బాగున్నాయి. వీళ్ళిద్దరికంటే మంచి నటన, హావభావాలతో అలరించిన నటి “అంటే సుందరానికి” ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ హారిక పెదాడ.

చిన్నారి ఉమగా ఆమె నటన సినిమాకు కీలకంగా మారింది. (Mayank Parakh) మయాంక్ పరాక్, చాందిని చౌదరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. చాందిని చౌదరి ఒక తెలుగమ్మాయిగా ఎంచుకుంటున్న పాత్రలను మాత్రం మెచ్చుకోవాలి.

సాంకేతికవర్గం పనితీరు: నరేష్ కుమరన్ (Naresh Kumaran)  నేపధ్య సంగీతం & విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. నరేష్ సెకండాఫ్ లోని ఎమోషన్స్ ను తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేసిన విధానానికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ రెడ్డి ఫిలిం మేకింగ్ విషయంలో పాటించే చాలా రూల్స్ ను బ్రేక్ చేసాడు. సహజమైన లొకేషన్స్ లో చాలా కష్టంతో కూడిన ఫ్రేమింగ్స్ తో కథను, కథనాన్ని ఎలివేట్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. దర్శకుడు విద్యాధర్ చాలా సాధారణ కథను, అసాధారణమైన కథనంతో ఆద్యంతం ఆకట్టుకొనేలా తెరకెక్కించిన విధానం బాగుంది. కథను నమ్మి, క్రౌడ్ ఫండింగ్ తో సినిమాను మొదలుపెట్టి.. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని, సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చి.. థియేటర్లలో విడుదలయ్యేలా చేసిన నిర్మాత కార్తీక్ శబరీష్ అభినందనీయుడు.

బడ్జెట్ ఇష్యుస్ వల్ల కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తిస్థాయిలో చెప్పలేకపోయినా, ప్రేక్షకులకు సింపుల్ గా అర్ధమయ్యేలా ముగించిన విధానం మాత్రం ప్రశంసనీయం. దర్శకుడిగా అతడికి మంచి భవిష్యత్ ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ను మెచ్చుకోవాలి. అంత తక్కువ బడ్జెట్ లో, ఈ స్థాయి అవుట్ పుట్ అనేది ఎవ్వరూ ఊహించలేనిది, మరెందరికో మార్గదర్శకమైనది.

విశ్లేషణ: తెలుగులో వచ్చిన సినిమాలుగా మిగిలిపోయే చిత్రాలు కొన్ని, ఇది తెలుగు సినిమారా అని చెప్పుకొనే చిత్రాలు కొన్ని. ఈ రెండో వర్గానికి చెందిన సినిమా “గామి”. ప్రొడక్షన్ డిజైన్ మొదలుకొని గ్రాఫిక్స్ వరకూ ప్రతీ టెక్నీకాలిటీ పారదర్శకంగా ఉండడం గమనార్హం. క్లైమాక్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

 

బాటమ్ లైన్: తెలుగు సినిమా స్థాయిని పెంచే “గామి”.

రేటింగ్: 3.5/5

Click Here To Read In ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinaya
  • #Chandini Chowdary
  • #Gaami
  • #Vidyadhar Kagita
  • #Vishwak Sen

Reviews

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

14 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

2 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

3 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

4 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

6 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version