అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న రామ్..!

ఇప్పటివరకూ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ తో యూట్యూబ్ ను షేక్ చేసేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. చాన్నాళ్ళ తరువాత మహేష్ ను ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో చూపించబోతున్నాడని టీజర్ తో స్పష్టమయ్యింది. ఈ టీజర్ చూసిన కొంతమంది హీరోలు అనిల్ రావిపూడికి ఫోన్ చేసి అభినందనలు తెలుపుతుండడంతో పాటు ‘నాతో సినిమా ఎప్పుడు తీస్తావ్ అని’ కూడా అడుగుతున్నారు.

ఈ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటివరకూ లవ్ స్టోరీల చేసి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో ఇక నుండీ కమర్షియల్ సినిమాలు చేయాలని రామ్ డిసైడ్ అయ్యాడట. ఇప్పుడు కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘రెడ్’ అనే సినిమా చేస్తున్న రామ్.. ఆ తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేయాలని భావిస్తున్నాడట. నిజానికి అనిల్ రావిపూడి.. రామ్ తో ‘రాజా ది గ్రేట్’ సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కానీ రామ్ రిజెక్ట్ చేసాడట. మళ్ళీ ఇప్పుడు ఆ డైరెక్టర్ కోసమే ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus