కొన్ని సినిమాలు ఎందుకు ట్రెండ్ అవుతాయి అనేది ఎవ్వరూ ఊహించలేని విషయం. ఒక్కోసారి సినిమా విడుదలైన కొన్నేళ్ల తర్వాత సడన్ గా ట్రెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం అలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సినిమా “ఆగ్రా” (Agra Mini) . కరోనాకి ముందు అంటే 2019లో షూటింగ్ ముగించుకుని 2023 ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదలైన ఈ చిత్రంలో తెలుగులో పాపులర్ అయిన రుహానీ శర్మ (Ruhani Sharma) ఓ ముఖ్యపాత్ర పోషించింది. ఆమె నటించిన కొన్ని Sruగార సన్నివేశాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ సినిమా థియేటర్లలో విడుదలవ్వకపోయినా.. పైరసీ కాపీ ఇప్పుడు ట్విట్టర్ మొత్తం కనిపిస్తున్నాయి.
Agra Mini Review
ఆ కారణంగా “ఆగ్రా” (Agra Mini) సినిమా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు ఏమిటా ఈ సినిమా అనే ఉత్సుకతతో చూసిన జనాలు షాకవుతున్నారు. ఊహించినదానికంటే ఎక్కువ Sruగార సన్నివేశాలు ఉన్నా.. సినిమాలో చర్చించిన విషయాలు రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. “ఆగ్రా” (Agra Mini) లోని ఒక ఇంట్లో నివసించే గురు (మోహిత్ అగర్వాల్) తన తల్లి (విభా చిబ్బర్), సవతి తల్లి (సోనాల్ ఝా)తో తరుచూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతుంటాడు. జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అనే అసంతృప్తి కంటే.. శారీరక సుఖం లేదనే బాధతో ఎక్కువగా క్రుంగిపోతుంటాడు.
ఆన్ లైన్ లో చాట్ చేసిన అమ్మాయి కాఫీ షాప్ లో చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందనే మానసిక బాధ మరియు కామంతో కళ్ళు మూసుకుపోయి ఏకంగా చెల్లి వరుస అయ్యే అమ్మాయిపై Laiగిక దాడి చేస్తాడు. అటువంటి నీచమైన మానసిక రుగ్మతతో బాధపడే గురుకి తన మైండ్ సెట్ కి సరిపడే విడాకులు తీసుకున్న మహిళ దొరుకుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఏం చేసారు అనేది “ఆగ్రా” కథాంశం. “తిత్లీ” సినిమాతో బాలీవుడ్ లో మినీ ప్రకంపనలు సృష్టించిన కాను బేల్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాలో Nueడిటీ కంటే భారతీయ కుటుంబ వ్యవస్థలను నిలదీసిన విధానమే ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ముఖ్యంగా వావివరసలు మరిచి Kaమ వాంఛతో కళ్లు మూసుకుపోయి కొందరు చేసే దారుణాలను, పెద్దలంటే కనీస స్థాయి గౌరవం లేకుండా కేవలం డబ్బు కోసం కొందరు ఆడే ఆటలను ప్రొజెక్ట్ చేసిన తీరు చాలా సహజంగా ఉంది. ఈ కథ మన ఇంట్లో జరగకపోవచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో పేపర్ లేదా టీవీలో ఫలానా చోట అలా జరిగింది అని ఈ తరహా వార్తలను చూస్తూనే ఉంటున్నాం. ఆ సంఘటనలను కలిపే దర్శకుడు “ఆగ్రా” సినిమాతో ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవ్వడం అనేది సెన్సార్ బోర్డు సాక్షిగా జరగని పని. అలాగే.. ఓటీటీలో విడుదలైనా కొన్ని కాకపోయినా కొన్ని సీన్స్ అయినా డిలీట్ అయిపోతాయి.
ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా కాదు, అలాగని ఇగ్నోర్ చేయాల్సిన సినిమా అంతకంటే కాదు.. సమాజంలోని జుగుప్సను గుర్తుచేసే సినిమా. ఏదో రుహానీ శర్మ సీన్స్ కోసం మాత్రమే సినిమాను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి చూడకండి, అంతకుమించిన పరిమితులు లేని Sruగార సన్నివేశాలు ప్రియాంక బోస్ & మోహిత్ అగర్వాల్ నడుమ ఉన్నాయి. ఆ సన్నివేశాలకు మించి మనల్ని మనం ప్రశ్నించుకొనేలా చేసే సన్నివేశాలు, సంభాషణలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటి కోసం “ఆగ్రా”ను ఒంటరిగా చూడండి. కచ్చితంగా సిగ్గుపడతారు, కానీ ఆలోచిస్తారు!