తండ్రి ఎలా ఉంటాడో తనకు తెలీదు అంటూ ఓ నటి చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సీనియర్ నటి లక్ష్మీ అందరికీ సుపరిచితమే. ఆమె 3 పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా భాస్కరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ 5 ఏళ్లకే అతనితో విడిపోయింది. ఈ జంటకి ఐశ్వర్య భాస్కరన్ సంతానం. ఆమె ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘నాని’ ‘ధైర్యం’ వంటి సినిమాల్లో నటించారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.ఐశ్వర్య మాట్లాడుతూ.. “నాకు 19 ఏళ్ళ వయసొచ్చాక మొదటిసారి నా తండ్రిని కలుసుకున్నాను. ఆయన ఎలా ఉంటారో తెలీకుండానే నా బాల్యం గడిచిపోయింది. కనీసం ఆయన ఫోటో చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. నా బర్త్ సర్టిఫికేట్‌లో నా తండ్రి పేరు ఉంది. కానీ ఆయన ఎలా ఉంటారో నాకు తెలీదు.
కచ్చితంగా ఆయన్ని కలుసుకోవాలనే ఆశ నాకు ఉంటుంది కదా.! నేను కూడా అలాగే పరితపించాను…ప్రయత్నించాను. అయితే కోయంబత్తూరులో ఇన్సూరెన్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్ నా తండ్రి ఆచూకీ తెలిపింది. ఆమె నా ఇంటర్వ్యూలు చూసి “మీ నాన్నగారి దగ్గరే నేను పనిచేస్తున్నాను. చాలా మంచి వ్యక్తి ఆయన. అతని నంబర్ మీకు పంపుతున్నాను. మీరు ఫోన్ చేసి కలిస్తే.. నేను చాలా సంతోషిస్తాను” అంటూ ఆమె నాకు తెలిపింది.
తర్వాత నేను నా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడి, ఆ తర్వాత కలుసుకున్నాను. నా అసలు పేరు శాంతమీన. మా అక్క మీన పేరు కలిసేలా నాకు ఈ పేరు పెట్టారు. కానీ నేను పుట్టకముందే ఆమె ఫ్రాన్స్‌లో మరణించింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నా పేరు ఐశ్వర్యగా నా తల్లి లక్ష్మీ మార్చారు” అంటూ చెప్పుకొచ్చింది.