Aishwarya,Abhishek: ఐశ్వర్య అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారా… అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలెబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ వివాహం చేసుకొని తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారో అయితే ఈ మధ్యకాలంలో తరచు వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలో అభిషేక్ బచ్చన్ ఘాటుగా స్పందించారు.

తాను ఐశ్వర్యకు విడాకులు ఇస్తానని రెండో పెళ్లి సంబంధం కూడా మీరే చూసి పెళ్లి చేయండి అంటూ ఈయన కాస్త వెటకారంగానే రిప్లై ఇచ్చారు. ఇలా విడాకుల వార్తలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వచ్చారు. ఇకపోతే తాజాగా మరోసారి ఐశ్వర్య అభిషేక్ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు మరోసారి వీరి విడాకులు వార్తలను తెరపైకి తీసుకువచ్చారు.

తాజాగా డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి పండుగ సందర్భంగా బాలీవుడ్ తారలందరికి కూడా ఘనంగా పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకలు పెద్ద ఎత్తున సెలెబ్రెటీలందరూ హాజరై సందడి చేశారు. అయితే ఇక్కడ మాత్రం ఐశ్వర్యరాయ్ మాత్రమే కనిపించారు. తన కుమార్తె భర్త హాజరు కాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. మనీష్ కేవలం ఐశ్వర్యను మాత్రమే ఇన్వైట్ చేశారా లేక ఐశ్వర్య అభిషేక్ మధ్య గొడవలు కారణంగా ఇక్కడికి రాలేకపోయారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది మాత్రమే కాకుండా (Aishwarya) ఐశ్వర్యరాయ్ 50 వ పుట్టినరోజు వేడుకలు అంటే తనకు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. అయితే తన పుట్టినరోజు వేడుకకు అభిషేక్ బచ్చన్ చాలా ఆలస్యంగా హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు కానీ ఈమె పుట్టినరోజు వేడుకలలో ఎక్కడ పాల్గొనలేదు కేవలం తన కుమార్తె ఆరాధ్య అలాగే ఐశ్వర్య తల్లి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దీంతో ఇద్దరు మధ్య ఏదో గొడవలు జరుగుతున్నాయని అందుకే ప్రతిసారి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యను అవాయిడ్ చేస్తున్నారంటూ వీరి విడాకులు వార్తలు వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus