మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi). ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు.
టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
దీంతో సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ డీసెంట్ గానే జరిగింది. మరి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 5 cr |
| సీడెడ్ | 2 cr |
| ఆంధ్ర(టోటల్) | 8 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 15 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.0 cr |
| ఓవర్సీస్ | 2.0 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 18 కోట్లు |
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. దానిని రీచ్ అవ్వాలంటే పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రేక్షకులకు మరో 4 సినిమాలు ఈ పండక్కి ఆప్షన్ గా ఉన్నాయి.మరి భారీ సంక్రాంతి పోటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం నెట్టుకొస్తుందో చూడాలి.