Aishwarya Rajesh: హీరోలకు టాలెంట్ అవసరం లేదు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్

సినీ నటుడు రాజేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఇలా ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ హీరో ఇంకా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అలాగే ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఈమె  (Aishwarya Rajesh) తనకు సినిమా అవకాశాలు రాకపోవడం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. హీరోలు తమ సినిమాలలో మనకు అవకాశం కల్పించాలి అంటే ఆ హీరోయిన్ కి మార్కెట్లో ఎంత వేల్యూ ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని అవకాశాలు కల్పిస్తారని నాలాంటి హీరోయిన్లకు అసలు అవకాశాలు ఇవ్వరని తెలియజేశారు. ఈ విధంగా హీరోలు తమ సినిమాలలో అవకాశాలు ఇవ్వకపోయినా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

నేను హీరోలు లేకపోయినా సినిమాలలో నటించి హిట్ సినిమాలను అందుకుంటానన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. తెలుగు హీరోలు కూడా అదేవిధంగా ఆలోచిస్తారా అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు మన తెలుగు హీరోలకి హీరోయిన్లలో టాలెంట్ అసలు అవసరం లేదని వారికి హీరోయిన్ అందంగా ఉంటే చాలని హీరోయిన్లలో అందం మాత్రమే చూస్తారు అంటూ ఈ సందర్భంగా ఈమె హీరోల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus