గోవా బీచ్ లో అజిత్..!

Advertisement

తన కుటుంబ సభ్యులతో వేసవి సెలవులను గడపడానికి తమిళ నటుడు అజిత్ లండన్ వెళుతున్నాడని కోలీవుడ్ లో వార్తలు వినవచ్చాయి. అయితే ఆయన గోవా బీచ్ తో తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ కనిపించారు.  ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి ఆయన గోవా వెళ్లారని..

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన తిరిగి చెన్నై చేరుకొనున్నట్లు సమాచారం. మరోవైపు అజిత్ నటించనున్న ‘అజిత్ 57’ వ చిత్రం  జూన్ నుంచి ప్రారంభం కానుంది. వీరమ్, వేదాలమ్ చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. యూ‌ఎస్, యూ‌కే లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నాడు. ఈ చిత్రంలో అజిత్ సరసన నటించడానికి రితిక సింగ్, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus