Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

సినిమాలు – రాజకీయాలు.. ఈ రెండింటి మధ్య దూరం చాలా తక్కువ. ఈ మాట విషయంలో మీకు ఏదైనా డౌట్‌ ఉంది అంటే ఓసారి తమిళనాడు పరిస్థితి చూడండి. నిజానికి ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎన్నో ఏళ్ల నుండి ఉంది. అయితే రీసెంట్‌గా ముఖ్యమంత్రిగా విజయ జోసెఫ్‌ అయినప్పటి నుండి, ఆ మాటకొస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మరోసారి సినిఆలు – రాజకీయాలు చర్చ మొదలైంది. ఈ రెండ రంగాల మధ్యలోకి సోషల్‌ మీడియా వచ్చి ఇష్యూను ఇంకా లప్చర్‌ చేస్తున్నాయి.

Vishal

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రముఖ కథానాయకుడు విశాల్‌ స్పందిచాడు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్‌ గురించి మాట్లాడిన విశాల్‌.. కొంతమంద యూట్యూబర్లు నటీనటుల గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ విషయమై తమిళనాడు సీఎం విజయ్‌కి ఓ విజ్ఞప్తి కూడా చేశారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడాడు. దీంతో ఆయన మాటలు ఇప్పుటు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నా ఫ్రెండ్‌ ఉదయనిధి ఏదో అన్నాడు.. అరెస్ట్‌ అయ్యాడు. అయితే సినిమా ఇండస్ట్రీలోని నటుల గురించి తమకు నచ్చినట్లుగా మాట్లాడేవారు చాలా మందే ఉన్నారు. అందులో యూట్యూబర్లు కూడా ఉన్నారు. ముఖం కనిపించకుండా అలా మాట్లాడేవాళ్లను, తెర ముందుకు తీసుకొచ్చి ఇదే విషయం చెప్పమని అడగండి. అయితే అప్పుడు వాళ్లు చెప్పరు. ఎందుకంటే దానికి వాళ్లకు డబ్బులు రావు కాబట్టి. అందుకే సీఎం విజయ్‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండస్ట్రీకి చెందిన వారి గురించి యూట్యూబ్‌లో నీచంగా మాట్లాడుతున్న వాళ్లందరికి కూడా శిక్షపడేలా చూడాలని కోరుతున్నా అని విశాల్‌ తెలిపారు.

ఉదయనిధి గురించి విశాల్‌ మాట్లాడుతూ.. మా స్నేహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చినా.. మా ఇద్దరి మధ్య విభేదాలు రావు. తీవ్రమైన దూషణలు కూడా ఉండవు. ఈ విషయాన్ని నేను ఈ రోజు బహిరంగంగా చెబుతున్నాను. అయితే గతంలో ఒక సినిమా విషయంలో నేను అనుభవించిన బాధ వల్ల ఉదయనిధి చెందిన నిర్మాణ సంస్థ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ గురించి కోపంగా మాట్లాడాను. కానీ ఉదయనిధి మంచి వ్యక్తి అని విశాల్ అన్నాడు.

ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus