Ajith: సాహసాలు చేసేవారికి అజిత్‌ పిలుపు.. మీరు ట్రై చేస్తారా?

  • May 24, 2023 / 12:11 PM IST

సినిమా వాళ్లు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇదేమీ కొత్త ట్రెండ్‌ కూడా కాదు. అయితే వాళ్ల వ్యాపారాలు అంటే రెస్టరెంట్లు, ఫ్యాషన్‌ బ్రాండ్‌లు.. అంటూ ఓ లెక్క ఉంటుంది. అయితే సినిమాల్లో వైవిధ్యం చూపించే అజిత్‌ ఇప్పుడు వ్యాపారంలోనూ చూపిస్తున్నాడు. రేసింగ్‌ అంటే ప్రాణంలా భావించే అజిత్‌ కుమార్‌ సరికొత్త వ్యాపారానికి శ్రీకారానికి చుట్టారు. ఇలాంటి వ్యాపారం కూడా ఉంటుందా అని అందరూ అనుకునేలా చేశారు. అంత స్పెషల్‌ వ్యాపారం ఏంటీ అనుకుంటున్నారా. రేసింగ్‌ అనుబంధంగా సాగే వ్యాపారమే ఇది కూడా.

అజిత్‌కు సైకిళ్లు, కార్లు లాంటి వివిధ వాహనాలపై అత్యంత ఆసక్తి. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా బైక్ టూర్‌లు చేస్తున్నారు కూడా. ఇప్పుడు ‘ఏకే మోటో రైడ్’ అనే అంతర్జాతీయ మోటార్ సైకిల్ టూరింగ్ కంపెనీని అజిత్‌ ప్రారంభించారు. రైడర్లు, సాహస ప్రియుల కోసం బైక్ అడ్వెంచర్ టూర్‌లను ఈ బిజినెస్‌లో నిర్వహిస్తారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రోడ్లపైనా టూర్లకు అవకాశం కల్పిస్తారు. బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే అనుభవాల్లాగే జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయని అజిత్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

లాంగ్ డ్రైవ్, అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి తగిన భద్రత, సౌకర్యాలను కల్పించడంలో ఏకే మోటో రైడ్ ముందుంటుందని కూడా చెప్పాడు. బైక్ టూర్‌లో అనుభవం ఉన్న వారిని ప్రొఫెషనల్ గైడ్‌గా అపాయింట్ చేస్తామని, ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా దానికి సంబంధించిన సమాచారాన్ని, అక్కడి పరిస్థితులు, సంస్కతి సంప్రదాయాల గురించి వారికి తెలిసి ఉంటుందని చెప్పాడు.

అజిత్ తన నెక్స్ట్ బైక్ టూర్ ‘ఏకే వరల్డ్ రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫేజ్’ ను ఈ ఏడాది నవంబరులో తిరిగి ప్రారంభిస్తారని సమాచారం. ఇక సినిమాల సంగతి చూస్తే… అజిత్ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus