Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అందరికీ ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలే గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్లో ‘అఖండ 2’ కూడా రూపొందింది. ఈ సినిమాపై మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, ట్రేడ్ వర్గాల్లో కానీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడింది.

Akhanda 2 Collections

మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకుని డిసెంబర్ 12న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అఖండ 2’. డిసెంబర్ 11 రాత్రి నుండి ప్రీమియర్ షోలు పడ్డాయి. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ మూటగట్టుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ సోమవారం నుండి కొంచెం ఎక్కువ డ్రాప్స్ పడ్డాయి. మంగళవారం రోజు ఆ లెక్క ఇంకా పెరిగింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 15.62 cr
సీడెడ్ 10.14 cr
ఉత్తరాంధ్ర 4.46 cr
ఈస్ట్ 3.56 cr
వెస్ట్ 2.03 cr
గుంటూరు 4.48 cr
కృష్ణా 3.08 cr
నెల్లూరు 2.31 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 45.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  5.17 cr
ఓవర్సీస్ 4.33 cr
టోటల్ వరల్డ్ వైడ్ 55.18 కోట్లు(షేర్)

‘అఖండ 2′(Akhanda 2) చిత్రానికి రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.102 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.55.18 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.93 కోట్లు కొల్లగొట్టింది.బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.46.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీక్ డేస్ లో స్టడీగా కలెక్ట్ చేసి.. 2వ వీకెండ్ కి మళ్ళీ గ్రోత్ చూపిస్తే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే.

అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus