హైపర్ ఆది(Hyper Aadi) పంచ్ డైలాగ్స్ ఏ రేంజ్లో వెళ్తాయో అందరికీ తెలుసు. స్టేజ్ మీదే కాదు, బయట కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. తాజాగా ఓ పాడ్‌కాస్ట్..లో భాగంగా కులం, పరువు హత్యలపై ఆది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సొసైటీలోని డబుల్ స్టాండర్డ్స్‌పై ఆది గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.సమాజంలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ పై ఆది తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు.
‘పెళ్లిళ్లు, సంబంధాలు కలుపుకునేటప్పుడు కులం పట్టింపులు చూస్తారు. మరి అక్రమ సంబంధాలకు మాత్రం కులంతో పనే లేదా? అక్కడ మాత్రం ఏ కులమైనా ఓకేనా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. మనం బయట చూస్తున్న వాస్తవాలివే అంటూ సొసైటీ తీరును ఎండగట్టారు.కష్టమొస్తే మన కులం వాడే మనల్ని ఆదుకుంటాడనే గ్యారెంటీ లేదని ఆది తేల్చి చెప్పారు. ‘ప్రాణం పోయేటప్పుడు నీళ్లిచ్చే వాడి కులం అడుగుతామా?
డాక్టర్ ఇంజక్షన్ చేసేటప్పుడు ఆయన కులమేంటో ఆరా తీస్తామా?’ అని లాజికల్ పాయింట్స్ రెయిజ్ చేశారు. అవసరానికి వాడుకునే కులం పిచ్చి ఎందుకని నిలదీశారు.ఇక పరువు హత్యలపైనా ఆది సీరియస్ అయ్యారు. ఇద్దరు ఇష్టపడితే పెళ్లి చేయాలి కానీ, చంపడం కరెక్ట్ కాదన్నారు. ఒకవేళ అబ్బాయికి ఉద్యోగం లేకపోతే.. సంపాదించుకోమని చెప్పాలి తప్ప, ప్రాణాలు తీస్తే ఏం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆవేశం తగ్గుతుందని, ఘోరాలు జరగవని హితవు పలికారు. ప్రస్తుతం ఆది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.