Akhanda 2: అఖండ2 మూవీపై షాకింగ్ అప్ డేట్స్.. ఏం జరిగిందంటే?

అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అయితే అఖండ2 సినిమా కథకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో దేవాలయాలపై దాడులను చూపించనున్నారని తెలుస్తోంది. మరో మతానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉంటే ఆ సమయంలో ప్రజలు పడే ఇబ్బందులను, దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారని తెలుస్తోంది.

పొలిటికల్ అంశాలు ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతోందని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమా కోసం 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అఖండ సినిమాను నిర్మించిన నిర్మాతే ఈ సినిమాను సైతం నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయి.

అఖండ2 (Akhanda 2) సైతం భారీ సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు తిరుగులేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని భారీ బడ్జెట్ తో తెరకెక్కినా ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య బోయపాటి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అఖండ2 కూడా సక్సెస్ సాధించి బాలయ్య రేంజ్ ను మరింత పెంచుతుందేమో చూడాలి. బాలయ్య వివాదాలకు దూరంగా ఉంటూ యంగ్ జనరేషన్ ఫ్యాన్స్ లో సైతం అభిమానులను పెంచుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus