‘అఖండ 2’ అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈరోజు అనగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలో ‘అఖండ 2’ గురించి కొన్ని ఊహించని మైనస్ పాయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మనం మొత్తంగా సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ని కూడా ఓ లుక్కేద్దాం రండి :
ప్లస్ పాయింట్స్
1) ‘అఖండ’ మొదటి భాగంలో బాగా హైలెట్ అయ్యింది అఘోర పాత్ర. దాని ఎంట్రీ సీన్ ని దర్శకుడు బోయపాటి శ్రీను చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. చిన బాలకృష్ణని పోలీసులు అరెస్ట్ చేయడం.. తర్వాత అతని ఫ్యామిలీని విలన్ గ్యాంగ్ టార్చర్ చేయడం. ఇక పరిస్థితి చేజారిపోయింది అనుకున్న టైంలో ఎంట్రీ ఇస్తుంది అఖండ రుద్ర సికందర్ అఘోర. ఇక ఈ సెకండ్ పార్ట్ లో ఆ పాత్రని ముందుగానే చూపించి అందరినీ అలర్ట్ అయ్యేలా చేశాడు బోయపాటి. అలాగే కథ, కథనం ఎలా ఉంటాయో ముందుగానే హింట్ ఇచ్చాడు.
2) ఇక చిన్న బాలకృష్ణ ఎంట్రీ సీన్, అలాగే అతని మేకోవర్ కూడా అదిరిపోయింది.
3)జాజికాయ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అందులో సంయుక్త మీనన్ గ్లామర్ ఆకర్షిస్తుంది అనడంలో సందేహం లేదు.
4) మహాకుంభమేళా విజువల్స్ అన్నీ తెరపై చూడటానికి బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది.
5) ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ని బాగా డిజైన్ చేశారు. అక్కడ వచ్చే త్రిశూలం ఫైట్ సీక్వెన్స్ పూనకాలు తెప్పించడం ఖాయం.
6)సెకండాఫ్..లో తల్లికి అఖండ తలకొరివి పెట్టే సన్నివేశం చాలా బాగుంది. ఆడియన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది ఆ తర్వాత వచ్చే సీన్.అంతకు మించి ఆ సన్నివేశం గురించి మాట్లాడితే స్పాయిలర్ అవ్వచ్చు. బిగ్ స్క్రీన్ పై ఆ సీన్ చూసినప్పుడు వచ్చే ఫీల్ వేరు.
7)హనుమంతుడి రిఫరెన్స్ తో వచ్చే ఫైట్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్
ఇప్పుడు మైనస్సుల గురించి మాట్లాడుకుందాం. ‘అఖండ’ కి ఏవైతే హైలెట్ అనుకుంటామో.. వాటి పై ఎక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్లడం వల్లనో ఏమో కానీ.. అవే మైనస్సులు అనే ఫీలింగ్ కలిగించాయి.
8) ‘అఖండ’ కి మెయిన్ హైలెట్ అంటే అది తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. బోయపాటి శ్రీను- తమన్..ల ప్రయాణం ‘సరైనోడు’ తో మొదలైంది. అయితే దానికి మించిన ఔట్పుట్ ‘అఖండ’ కి ఇచ్చాడు తమన్. కానీ తర్వాత బోయపాటితో చేసిన ‘స్కంద’ కి తమన్ అందించిన బీజీఎం తేలిపోయింది. అయితే ఇప్పుడు ‘అఖండ 2’ కి చేస్తున్నాడు కాబట్టి.. కచ్చితంగా ‘అఖండ’ రేంజ్లో బీజీఎం ఇస్తాడని అంతా ఆశిస్తారు. అది సహజం. కానీ ‘అఖండ 2’ బీజీఎం ‘అఖండ’ ని మ్యాచ్ చేయకపోగా ‘స్కంద’ స్థాయిలో ఉండటం డిజప్పాయింట్ చేసే అంశం. సో ‘అఖండ 2’ కి తమన్ అందించిన బీజీఎమ్ పెద్ద మైనస్.
9) ఆది పినిశెట్టిని ఈ సినిమా కోసం విలన్ గా తీసుకున్నారు. అతని మేకోవర్ బాగుంది. తన వరకు బాగా చేశాడు కూడా. కానీ అసలు ఆ పాత్రకి సరైన ఆర్క్ లేదు. సెకండాఫ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా వస్తుంది. దానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి పెట్టారు. దానికో 20 నిమిషాలు టైం వేస్ట్ అనిపించింది. తర్వాత ఏమైనా ఆ పాత్రకి ప్రాముఖ్యత ఉంటుందా? అంటే అదీ లేదు. ఏదో బట్టలు ఉతికేటప్పుడు నేలకేసి కొట్టినట్టు.. బాలయ్య ఆది పాత్రని నేలకేసి కొట్టి చంపడం చాలా కామెడీగా అనిపించింది. ఇలాంటి పాత్రని ఆది ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో అతనికే తెలియాలి.
10) సంయుక్త మీనన్ పాత్ర కూడా సినిమాలో తేలిపోయింది. డైలాగులతోనే ఆమె పాత్రలోని ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు అని దర్శకుడు బోయపాటి అనుకున్నాడేమో. అలాంటి మేజిక్ జరగలేదు. పైగా ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. సరిగ్గా క్లోజప్ షాట్ పెట్టడానికి కూడా సినిమాటోగ్రాఫర్ బయపడినట్టు ఉన్నాడు.