విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో రూ.300 కోట్ల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సినిమాకి గాను వెంకటేష్ అందుకున్న పారితోషికం రూ.20 కోట్లు అలాగే లాభాల్లో వాటా కూడా..! ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’… అనే సినిమా చేస్తున్నారు. ‘ఏకే 47’ అనేది ఈ సినిమాకి సబ్ టైటిల్. ఎక్కువమంది పలకడానికి వీలుగా ఆ షార్ట్ టైటిల్ పెట్టారు.
థ్రిల్లర్ జోనర్ కి ఫ్యామిలీ టచ్ ఇస్తూ త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లేశ్వరి’ సినిమాల రేంజ్లో ఫన్ కూడా ఉంటుంది. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకటేష్ చేసిన ఆ 2 సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమా ‘ఏకే 47’.టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా.స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
వెంకటేష్ అలాగే కొంతమంది నటీనటుల పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి జోడీగా నటిస్తుంది. 2026 సమ్మర్ కి రిలీజ్ అని ఇటీవల ప్రకటించారు. కానీ అది దసరా లేదా 2027 సంక్రాంతికి వరకు అవ్వొచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘ఏకే 47 ‘ కి కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే అప్లై చేస్తున్నాడట వెంకటేష్.
ఈ సినిమా కోసం వెంకటేష్ రూ.30 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.అలాగే లాభాల్లో వాటా కూడా తీసుకుంటారట వెంకీ. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో మరో సినిమా లేదు. ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో కేమియో చేశారు వెంకీ. అటు తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.