నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ‘పుష్ప’ ‘శ్యామ్ సింగరాయ్’ వంటి పెద్ద చిత్రాలు పోటీగా రిలీజ్ అయినప్పటికీ…ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ తో పాటు మరికొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఇంకా ఈ చిత్రం రాణిస్తుండడం విశేషం. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 46 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం | 20.80 cr |
సీడెడ్ | 15.85 cr |
ఉత్తరాంధ్ర | 6.30 cr |
ఈస్ట్ | 4.25 cr |
వెస్ట్ | 3.99 cr |
గుంటూరు | 4.85 cr |
కృష్ణా | 3.63 cr |
నెల్లూరు | 2.65 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 62.32 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 10.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 72.82 cr |
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 46 రోజులు పూర్తయ్యేసరికి… రూ.72.82 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.18.82 కోట్ల లాభాలు దక్కాయి.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 21న ‘అఖండ’ డిజిటల్ రిలీజ్ కానుంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!