నేటి నుంచి అఖిల్ మూడో సినిమా షూటింగ్ షురూ

బ్యాట్స్ మ్యాన్ కి సింగిల్స్, డబుల్స్ తీస్తే తృప్తి ఉండదు. కొడితే సిక్స్ కొట్టాలి.. అప్పుడే సంతృప్తి ఉంటుంది. ఇలాంటి సిక్స్ లను ఎన్నోకొట్టాడు అఖిల్. హీరోగా సిక్స్ కొట్టలేదు. అదే మంచి హిట్ కొట్టలేదు. అఖిల్ మూవీతో డకౌట్ అయినప్పటికీ … తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో కొన్ని రన్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అందుకే ఈ సారి సిక్స్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించబోతున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా టీమ్ మొత్తం ప్రస్తుతం లండన్లో ఉంది. ఈరోజు నుంచి తొలి షెడ్యూల్ మొదలుకానుంది.

40 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ షెడ్యూల్లో కీలక పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ రోల్ ఏంటో బయటికి వచ్చింది. ప్లే బాయ్ గా అఖిల్ ఇందులో ఆకట్టుకోనున్నట్లు తెలిసింది. ప్రేమ అనే విషయాన్నీ ట్రాష్ అనే చెప్పే ఓ యువకుడు నిజంగా ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో వెంకీ అట్లూరి కొత్తగా చూపించబోతున్నారు. నేటి యువతకి స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నఈ చిత్రంపై అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus