Akhil: ఇక్కడ మాట్లాడటానికి రాలేదు చేయాల్సింది చాలా ఉంది!

అక్కినేని వారసుడిగా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అఖిల్ మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ నటించిన తదుపరిచిత్రాలు మిస్టర్ మజ్ను హలో సినిమాలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అఖిల్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.ఈ విధంగా అఖిల్ వరుస ఫ్లాప్ సినిమాలలో నటించడంతో ఈయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని భావించారు.

అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అఖిల్ కెరీర్ కు కాస్త బూస్టప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అఖిల్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి చేపట్టారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాని తెరకెక్కించారు.ఇక చాకోలెట్ బాయ్ లా ఉండే అఖిల్ ను ఈ సినిమాలో సురేందర్ రెడ్డి పూర్తిగా యాక్షన్ హీరోల మార్చేశారు.

ఈ సినిమాలో అఖిల్ లుక్ చూస్తుంటేనే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కొట్టబోతున్నారని అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఏజెంట్ సినిమా నుంచి విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే అఖిల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అర్థమవుతుంది. సురేందర్ రెడ్డి అఖిల్ ను బాలీవుడ్ రేంజ్ లో చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అఖిల్ మాట్లాడుతూ… నాకు క్రాక్ వచ్చి మెంటల్ ఎక్కేసింది మీ ఎనర్జీ వల్ల నాలో నిప్పు అంటుకుంది అంటూ అభిమానుల ముందు గుండెలు బాదుకున్నారు.ఇకపోతే సురేందర్ రెడ్డి ఈ వేదికపై మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఇక్కడ మాట్లాడటానికి రాలేదని అక్కడ చేయాల్సింది చాలా ఉంది తప్పకుండా మీకు బ్లాక్ బస్టర్ ఇస్తా అంటూ హామీ ఇచ్చారు. ఇకపోతే అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus